MGNREGA : కూలీలకు కేంద్రం నుండి సంచలన గుడ్ న్యూస్ -ఇంకా డ్రిక్ట్ గా మీ అకౌంట్లోకి ….!

MGNREGA : కూలీలకు కేంద్రం నుండి సంచలన గుడ్ న్యూస్ -ఇంకా డ్రిక్ట్ గా మీ అకౌంట్లోకి ….!

MGNREGA : కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) కూలీలకు గుడ్ న్యూస్ అందించింది. ఈ పథకం కింద కూలీలకు పేమెంట్ చేయడాన్ని ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ (ABPS) ద్వారా మాండేటరీ చేసింది. అయితే, ఈ నిర్ణయాన్ని పార్లమెంటరీ కమిటీ తప్పుపట్టింది. కమిటీ ఆధార్ ఆధారిత పేమెంట్ సిస్టమ్‌ను ఆప్షనల్ చేయాలని ప్రభుత్వానికి సూచించింది.

ఆధార్ ఆధారిత పేమెంట్ సిస్టమ్

కేంద్ర ప్రభుత్వం ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ (ABPS) ద్వారా కూలీలకు పేమెంట్ చేయడాన్ని మాండేటరీ చేసింది. ఈ నిర్ణయాన్ని పార్లమెంటరీ కమిటీ తప్పుపట్టింది. కమిటీ ఆధార్ ఆధారిత పేమెంట్ సిస్టమ్‌ను ఆప్షనల్ చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఆధార్ ఆధారిత పేమెంట్ సిస్టమ్‌తో కూలీలకు నష్టం కలుగుతోందని కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలాకా నేతృత్వంలోని కమిటీ పేర్కొంది. 2025-26 ఏడాదికి సంబంధించిన డిమాండ్లతో లోక్‌సభలో ఈ కమిటీ రిపోర్టును సబ్మిట్ చేసింది.

పేమెంట్ విధానం

పేమెంట్ విధానాన్ని ఏబీపీఎస్ ద్వారానే జరపాలని మాండేటరీ కావడంతో ఆపరేషనల్ సవాళ్ల కారణంగా లబ్ధిదారులు లబ్ధి పొందలేకపోతున్నారని తెలిపింది. ‘కొందరు కూలీలకు ఆధార్ బయోమెట్రిక్ సమస్యలున్నాయి. మరికొందరికి జాబ్ కార్డుల్లో ఉన్న వివరాలకు, ఆధార్ వివరాలకు తేడాలు ఉన్నాయి. దీంతో జాబితా నుంచి కార్మికుల తొలగింపు తప్పుదారి పడుతోంది. ఫలితంగా పేమెంట్ రావట్లేదు. కూలీలకు హక్కుగా రావాల్సిన వేతనాలు అందకుండా మిగిలిపోతున్నాయి. కాబట్టి, ఏబీపీఎస్‌ను ఆప్షనల్ చేసి ఆల్టర్నేటివ్ పేమెంట్ విధానంలో కూలీలకు చెల్లింపులు జరపాలి’ అని కమిటీ సూచించింది.

పని రోజుల సంఖ్య

ఈ పథకం కింద గ్యారంటీ పని రోజుల సంఖ్యను 100 నుంచి 150కి పెంచాలని కమిటీ సూచించింది. దీంతో పాటు మరికొన్ని పనులను ఉపాధి హామీ పథకం కింద చేర్చాలని సజెస్ట్ చేసింది. పెండింగ్‌లో ఉన్న పేమెంట్లను గడువులోగా క్లియర్ చేయాలని, గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు ఆగకుండా చూడాలని కోరింది. అదే విధంగా, పేమెంట్ డిలే కారణంగా లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందులతో సతమతం కాకుండా చూసుకోవాలంది.

బ్యాంక్ అకౌంట్ల మార్పు

కూలీలు ఒక్కోసారి బ్యాంక్ అకౌంట్‌లను మార్చుతున్నారు. ఇలా మార్చిన బ్యాంక్ అకౌంట్లను జాబ్ కార్డులకు అప్‌డేట్ చేయట్లేదు. దీంతో ఆధార్ ఆధారిత పేమెంట్ సిస్టమ్‌ను 2024, జనవరి 1నుంచి కేంద్రం మాండేటరీ చేసింది. ఈ పేమెంట్ సిస్టమ్‌తో ఆధార్‌తో లింకై ఉన్న బ్యాంక్ అకౌంట్‌కు నేరుగా వేతనాలు ట్రాన్స్‌ఫర్ అవుతాయి. ఈ విధానాన్నే పార్లమెంటరీ కమిటీ ఆప్షనల్‌గా పెట్టాలని చెప్పింది.

పెండింగ్ బకాయిలు

రూరల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ వెల్లడించిన వివరాల ప్రకారం.. కూలీలకు ఇంకా రూ.12,219.18 కోట్ల వేతనాలు చెల్లించాల్సి ఉంది. రూ.11,227.09 కోట్లు సామగ్రి బకాయి ఉంది. మొత్తం కలిపితే రూ.23,446.27 కోట్ల బకాయిలు ఉన్నాయి. పథకానికి కేటాయించిన ప్రస్తుత బడ్జెట్‌లో ఈ బకాయిలు రూ.27.26 శాతానికి సమానం. అంటే, నాలుగులో ఒక వంతు నిధులు పోయిన బిల్లులను క్లియర్ చేసేందుకే వాడాల్సి వస్తోంది.

Hyderabad HMDA విస్తరణ షాక్! 11 జిల్లాలలో 10472 sq km పరిధి!

Leave a Comment